Kadiam Kavya Big Shock to BRS (Credits: X)

Warangal, Mar 29: పుట్టెడు కష్టాల్లో మునిగిన బీఆర్ఎస్‌ (BRS) కు లోక్ సభ (Loksabha) ఎన్నికల వేళ  మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య (Kadiam Kavya Big Shock to BRS) తప్పుకున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు కావ్య లేఖ రాశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు 3 రోజుల క్రితమే కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన కావ్య పోటీ నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. తాను పోటీ నుంచి వైదొలగడానికి గల కారణాలను లేఖలో సుదీర్ఘంగా వివరించారు.

Mukhtar Ansari Dies: గ్యాంగ్ స్ట‌ర్ ముక్తార్ అన్సారీ మృతి, గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించిన జైలు అధికారులు, 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముక్తార్ మాజీ ఉప‌రాష్ట్రప‌తికి సోద‌రుడు

లేఖలో కావ్య ఏమన్నారు?

  • గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కాం వంటి ఆరోపణలు వస్తున్నాయి.
  • ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పార్టీకి నష్టం జరిగింది.
  • నేతల మధ్య సమన్వయం కూడా లోపించింది.
  • ఈ కారణాలతో  నేను పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా.
  • కేసీఆర్‌, బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను క్షమించాలి.

కాంగ్రెస్ కండువా?!

కాగా తన తండ్రి, స్టేషన్‌ ఘన్‌ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కడియం కావ్య పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

Mukhtar Ansari Hospitalized: జైల్లోనే కుప్ప‌కూలిన గ్యాంగ్ స్ట‌ర్ ముక్తార్ అన్సారీ, ఐసీయూలో చికిత్స అందిస్తున్న జైలు సిబ్బంది, త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని గ‌తంలో ప‌లుమార్లు లేఖ‌లు