Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దుర్మరణం (వీడియో)

ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident (Credits: X)

Newdelhi, Dec 3: కేరళలో (Kerala) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం రాత్రి అలప్పుజ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వందనం మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సోమవారం రాత్రి గురువాయుర్ నుంచి కాయంకులం బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది.

వీడియో ఇదిగో, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌‌లో ఘోరంగా తన్నుకున్న అభిమానులు, 100 మందికి పైగా మృతి, రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదం అవడమే కారణం

Here's Video:

అందుకే??

వర్షం, రాత్రి వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. విద్యార్థులంతా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif