Fire Accident in Delhi: ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)
ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Newdelhi, May 26: ఢిల్లీలోని (Delhi) ఓ పిల్లల ఆసుపత్రిలో (Children Hospital) శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ సెంటర్ లో రాత్రి 11.32గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఆస్పత్రి భవనం నుంచి 12 మంది నవజాత శిశువులను రక్షించామని, అయితే మరో ఏడుగురిని కాపాడలేకపోయామన్నారు.
మరో అగ్ని ప్రమాదం
మరో ఘటనలో ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని నివాస భవనంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని 13మందిని రక్షించారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.