Attack on Ambulance Driver: మంటగలిసిన మానవత్వం.. చిన్నారికి అత్యవసర చికిత్స కోసం వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌.. తమ కారును ఓవర్‌ టేక్‌ చేసిందన్న కోపంతో అంబులెన్స్‌ ను అడ్డగించిన దుండగులు.. అంబులెన్స్‌ డ్రైవర్‌ పై విచక్షణా రహితంగా దాడి.. బెంగళూరులో ఘటన (వీడియో ఇదిగో)

తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆక్సిజన్‌ సపోర్ట్‌ తో అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌ బయల్దేరింది.

Attack on Ambulance Driver (Credits: X)

Bengaluru, June 11: ఆ చిన్నారి వయసు ఐదు నెలలు. తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆక్సిజన్‌ సపోర్ట్‌ తో అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌ (Ambulance) బయల్దేరింది. పాపను ఎలాగైనా కాపాడాలని డ్రైవర్ (Driver) అంబులెన్స్‌ ను వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలో  ఒక కారును ఓవర్‌ టేక్‌ చేశాడు. దీన్ని చూసిన ఆ కారులో ఉన్న వ్యక్తులు ఊగిపోయారు. మా కారునే ఓవర్ టేక్ చేస్తావా అంటూ  అంబులెన్స్‌ ను ఫాలో అయ్యారు. ఎట్టకేలకు అంబులెన్స్‌ అడ్డుకున్నారు. అంబులెన్స్‌ లోని డ్రైవర్‌ ను విపరీతంగా కొట్టారు. పసిపాపను ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని, వదిలిపెట్టాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నప్పటికీ వారు కనికరించలేదు. మానవత్వం మంటగలిసేలా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్

అత్యవసర వైద్యం అవసరం కావడంతో..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ఐదు నెలల పసి పాపను ఆక్సిజన్‌ సపోర్ట్‌ తో బెంగళూరులోని ఓ  హాస్పిటల్‌ కు అంబులెన్స్‌ లో తరలిస్తున్నారు. చిన్నారికి అత్యవసర వైద్యం అవసరం కావడంతో డ్రైవర్‌ జాన్‌ అంబులెన్స్‌ ను వేగంగా నడిపాడు. ఈ క్రమంలో ఇన్నోవా కారును ఓవర్‌ టేక్ చేశాడు. ఆ కారులో ఉన్న వ్యక్తులు తమ వాహనాన్ని ఓవర్‌ టేక్ చేయడంపై ఆగ్రహించారు. సుమారు ఆరు కిలోమీటర్ల వరకు అంబులెన్స్‌ ను అనుసరించారు. అంబులెన్స్‌ ను ఓవర్‌ టేక్‌ చేసి అడ్డుకున్నారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ ను కొట్టారు. తమ పాప పరిస్థితి సీరియస్‌ గా ఉందని అంబులెన్స్‌ వెళ్లేందుకు అనుమతించాలని చిన్నారి పేరెంట్స్‌ చేతులు జోడించి వారిని వేడుకున్నా డ్రైవర్‌ పై దాడిని కొనసాగించారు. చివరకు పోలీసుల జోక్యంతో అంబులెన్స్‌ ను విడిచిపెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ పై దాడి చేసిన నలుగురిని అరెస్ట్‌ చేశారు.

ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై బాబు సర్కార్ ఫోకస్.. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాలపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం అధ్యయనం.. చివరకు తెలంగాణ ‘ఫ్రీ బస్సు’ మాడల్ కు సై!



సంబంధిత వార్తలు