Ayodhya Ram Temple Leakage: ప్రారంభించి ఐదు నెలలు కూడా కాకముందే అయోధ్య రామాలయం పైకప్పులో లీక్.. తొలి వర్షానికే గర్భగుడిలోకి నీళ్లు.. పూజారి, వీఐపీలు కూర్చొనే చోట లీకేజీలు

ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఐదు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది.

Ayodhya Temple (Credits: X)

Ayodhya, June 25: భవ్య మందిరం అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) నిర్మాణ వైఫల్యాలు బయటపడ్డాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఐదు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ (Leak) అవుతోంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన మొట్టమొదటి భారీ వర్షానికి గర్భగుడిలోకి నీళ్లు  చొచ్చుకొని వచ్చాయి. రామ్‌ లల్లా ముందు పూజారి కూర్చునే చోట, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి.

మద్యం షాపులు, ఇతర కమర్షియల్ షాప్స్ క్లోజింగ్ టైమింగ్స్‌ ప్రచారంపై హైదరాబాద్ పోలీసుల స్పందన

నిర్మాణంలో నిర్లక్ష్యం

రామ మందిరంలోనీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని మండిపడ్డారు. ఇలా లీకేజీ అవుతుంటే లోపల కూర్చుని పూజ చేయడం కూడా ఇబ్బందేనని పేర్కొన్నారు. గర్భగుడిలోకి నీళ్లు లీక్ అవుతుండటంపై అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా స్పందించారు. వెంటనే ఆలయాన్ని పరిశీలించారు. తక్షణమే మరమ్మతులు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిన రోహిత్ సేన



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif