Hyderabad, June 25: తెలంగాణలో (Telangana) ప్రస్తుతం నెలకొన్న శాంతి-భద్రతల (Law and Order) దృష్ట్యా ఇకపై రాష్ట్రంలోని వైన్ షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 -11.00 కల్లా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారంటూ ప్రధాన వార్తా వెబ్ సైట్లు, టీవీ చానల్స్ తో పాటు సోషల్ మీడియాలో సోమవారం వార్తలు గుప్పుమన్నాయి. ఈ ప్రచారంపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారంటూ వస్తున్న నిజంకాదని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిన రోహిత్ సేన
సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి.
దుకాణాలు మరియు సంస్థలు తెరియు మరియు మూసి వేయు సమయములు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగును.
ఇది అందరూ గమనించగలరు.
— Hyderabad City Police (@hydcitypolice) June 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)