Bengaluru Viral Video: రైడ్ క్యాన్సిల్ చేయమన్నందుకు కస్టమర్‌పై దాడికి దిగిన ఆటో డ్రైవర్, బెంగళూరులో నడిరోడ్డుపై రౌడీయిజం చూపించిన ఆటోవాలా, వైరల్‌గా మారిన వీడియో
దాంతో అనీశ్ అక్కర్లేదని చెప్పాడు. అయితే, రైడ్ క్యాన్సిల్ చేయిమని ఆటో డ్రైవర్ అనీశ్‌పై హుకుం చేశాడు. అందుకు అనీశ్ (Aneesh) ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దాంతో ఆటో దిగి వచ్చిన డ్రైవర్ అనీశ్‌పై దాడి చేశాడు.
Bengaluru, June 17: కస్టమర్ రైడ్ క్యాన్సిల్ (Cancelling Trip) చేయమంటే చేయలేదని ఓ ఆటో డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు (Bengaluru) చెందిన అనీశ్ అనే వ్యక్తి ఓ మొబైల్ యాప్‌లో ఆటో బుక్ చేశాడు. పికప్ పాయింట్‌కు వచ్చిన ఆటో డ్రైవర్ ఎక్కువ చార్జి డిమాండ్ చేశాడు. దాంతో అనీశ్ అక్కర్లేదని చెప్పాడు. అయితే, రైడ్ క్యాన్సిల్ చేయిమని ఆటో డ్రైవర్ అనీశ్‌పై హుకుం చేశాడు. అందుకు అనీశ్ (Aneesh) ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దాంతో ఆటో దిగి వచ్చిన డ్రైవర్ అనీశ్‌పై దాడి చేశాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న అనీశ్‌ను డ్రైవర్ ముందుగా ఆటోతో ఢీకొట్టాడు. అనంతరం ఆటో దిగి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అనీశ్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
‘ఇది బెంగళూరు వాసులకు నిత్యం ఎదురయ్యే సమస్య. మీరు ఉబెర్ లేదా ఓలా ఆటోను బుక్ చేయండి. డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చెయ్ ఆఫ్‌లైన్‌లో తీసుకెళ్తా అంటాడు. అందుకు నువ్వు ఒప్పుకోకపోతే దాడి చేస్తాడు. నోటికొచ్చినట్టు తిడుతాడు’ అనే వ్యాఖ్యలను అనీశ్ తన ట్వీట్‌కు జతచేశాడు. అనంతరం బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ.. దయచేసి చర్యలు తీసుకోండి అని పేర్కొన్నాడు. ఆటో నంబర్ 7734 అని తెలిపాడు.