Mehaboob Dilse : బిగ్ బాస్ ఫేం మెహబూబ్ ఇంట్లో విషాదం.. తల్లిని కోల్పోవడంతో ఎమోషనల్ పోస్ట్

బాధతో పోస్ట్ పెట్టిన నటుడు.. ధైర్యంగా ఉండాలంటూ నెటిజన్ల కామెంట్స్

Mahaboob (Photo Credit: Instagram)

Hyderabad, August 7: బిగ్‌బాస్‌ (Bigboss) ​కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే (Mehaboobdilse) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో మెహబూబ్‌ తల్లి మరణించింది. తల్లి మృతి పట్ల మెహబూబ్‌ ఓ భావోద్వేగ పోస్టు (Post)ను షేర్‌ చేశాడు. 'అమ్మా.. నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్‌.. ఇకపై నేను నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ(అమ్మా)?  జీవితం అంటే ఏంటో నేర్పించావు. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తుంటావని తెలుసు. నిన్ను గర్వపడేలా చేస్తానమ్మా. తమ్ముడు, డాడీని బాగా చూసుకుంటా. నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను' అంటూ మెహబూబ్‌ ఎమోషనల్‌ (Emotional) పోస్ట్‌ ను షేర్‌ చేశాడు.

భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..

ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు (Netizens) స్టే స్ట్రాంగ్‌ మెహబూబ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)



సంబంధిత వార్తలు

Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్ బాగ్ తెలుగు గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా ఎవ‌రొస్తున్నారో తెలుసా? టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త‌ల్లో నిజ‌మెంత‌?

Telugu Biggboss Season 8: బిగ్ బాస్ సీజ‌న్ 8 టీజ‌ర్ వ‌చ్చేసింది! ఈ సీజ‌న్ లో కంటెస్టెంట్లు ఎవ‌రెవ‌రంటే?

Telugu Bigg Boss 7: తెలుగు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు ఫుల్ లిస్ట్ ఇదే! హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా, శివాజీతో పాటూ సోషల్ మీడియా స్టార్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు స్ట్రీమ్ కానున్న బిగ్‌ బాస్‌ 7

Biggboss 7 Telugu: మరింత కిక్కెక్కించనున్న బిగ్‌ బాస్‌ సీజన్ 7, సరికొత్త సవాళ్లు అంటూ హింట్ ఇచ్చిన కింగ్ నాగార్జున, బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి ముందు సరికొత్త ప్రోగ్రాం