Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్ బాగ్ తెలుగు గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా ఎవ‌రొస్తున్నారో తెలుసా? టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త‌ల్లో నిజ‌మెంత‌?

బుల్లి తెర ప్రేక్షకుల ఫేవ‌రేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరి దశకు చేరుకున్న విష‌యం తెలిసిందే. 14 వారాలుగా ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ వస్తున్న ఈ షో ముగియడానికి ఈ వారమే మిగిలింది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే (Bigg Boss Telugu 8 Grand Finale) నిర్వహించి టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించ‌నున్నారు

Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్ బాగ్ తెలుగు గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా ఎవ‌రొస్తున్నారో తెలుసా? టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త‌ల్లో నిజ‌మెంత‌?
Telugu Biggboss Season 8

Hyderabad, DEC 12: నిర్వ‌హాకులు. అయితే ఈ సీజ‌న్‌ టైటిల్ విన్న‌ర్ ఎవ‌రు అవుతారా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం హౌజ్‌లో టాప్ 5 ఫైన‌లిస్ట్‌లు (అవినాష్​, నిఖిల్​, గౌతమ్​, ప్రేరణ, నబీల్) ఉండ‌గా… ఇందులో నుంచి ఒక‌రు మాత్ర‌మే బిగ్ బాస్ టైటిల్ విజేత‌గా నిల‌వ‌నున్నారు.

Coolie Video Out: ర‌జ‌నీకాంత్ కొత్త మూవీ కూలీ నుంచి మాస్ వ‌చ్చేసింది! 74 ఏళ్ల వ‌య‌స్సులోనూ త‌లైవాలో త‌గ్గ‌ని జోష్ 

అయితే ఈ ట్రోఫీ అందించ‌డానికి టాలీవుడ్ నుంచి స్టార్ హీరో రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ సీజ‌న్ 8 ఫినాలేకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్‌ (Allu Arjun) హాజ‌రుకాబోతున్న‌ట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అల్లు అర్జున్ ఫినాలేకి రానున్నారనే టాక్ ఇప్ప‌టికే నెట్టింట జోరుగా న‌డుస్తుంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే అటు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇటు బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కు పండ‌గ‌నే చెప్పాలి.

(The above story first appeared on LatestLY on Dec 12, 2024 11:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).