Buffalo Settles Ownership Dispute: ఓనర్ల మధ్య నెలకొన్న పంచాయితీ తెంచిన గేదె.. యూపీలో ఘటన.. అసలేం జరిగింది?

రెండు వర్గాల మధ్య మొదలైన గొడవలకు ఊరి పంచాయితీ పెద్దలు సయోధ్యతో ముగింపునివ్వడమూ చూస్తాం. అయితే, ఇద్దరు ఓనర్ల మధ్య మొదలైన పంచాయితీని ఓ గేదె పరిష్కరించింది.

Buffalo (Credits: X)

Newdelhi, July 6: కోర్టుల్లో (Court) న్యాయ విచారణ గురించి తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవలకు ఊరి పంచాయితీ పెద్దలు సయోధ్యతో ముగింపునివ్వడమూ చూస్తాం. అయితే, ఇద్దరు ఓనర్ల మధ్య మొదలైన పంచాయితీని ఓ గేదె (Buffalo) పరిష్కరించింది. వివరాల్లోకెళితే.. యూపీలోని (UP) ప్రతాప్‌ గఢ్‌ జిల్లా అక్షరాంపూర్‌ గ్రామంలో నందలాల్‌ సరోజ్‌ కు చెందిన గేదె  కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. అది పూరే హరికేశ్‌ గ్రామానికి చేరింది. ఆ ఊరికి చెందిన హనుమాన్‌ దాన్ని కట్టేశాడు. నందలాల్‌ ఎంత వెతికినా గేదె ఆచూకీ దొరకలేదు. చివరికి హనుమాన్‌ వద్ద ఉన్నదని తెలిసి, అక్కడికి వెళ్లి అడగ్గా.. ఆ గేదె తనదేనని వాదించాడు. దీంతో నందలాల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసి, పంచాయితీకి పిలిపించాడు.

స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, అల్యూమినియం వంట పాత్రలకు ఐఎస్‌ఐ గుర్తు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

గేదె తీర్పు ఇలా..

ఆ గేదె తనదేనని హనుమాన్‌, నందలాల్‌ గొడవపడ్డారు. ఏం చేయాలో పాలుపోకపోవటంతో స్టేషన్‌ ఆఫీసర్‌ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ గేదెను రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టి, ఆ గేదె ఏ యజమాని చెంతకు చేరితే వారే అసలైన యజమాని అని స్పష్టం చేశారు. దానికి ఇరు వర్గాలు సమ్మతించాయి. దీంతో ఆ గేదెను తీసుకొచ్చి రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టగా, అది నేరుగా నందలాల్‌ ఇంటికి చేరింది. దీంతో హనుమాన్‌ ను పోలీసులు, గ్రామస్థులు మందలించారు. అలా గేదె తన యజమానిని ఎన్నుకొన్నది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?



సంబంధిత వార్తలు

Manchu Family Dispute: మైక్ తీసుకొచ్చి నోట్లో పెట్టారు, మీ ఇంట్లో ఎవరైనా దూరి ఇలా చేస్తే అంగీకరిస్తారా? రెండో ఆడియోని విడుదల చేసిన మోహన్ బాబు

Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ అరెస్ట్

Manchu Family Dispute: ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు

Manchu Family Dispute: మోహన్‌ బాబుపై కాంగ్రెస్ నేతల ఫైర్, జర్నలిస్టులపై దాడి సరికాదని మండిపాటు, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif