Hanamkonda Accident: వేగంగా వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. కారు వేగానికి బొక్కబోర్లాపడ్డ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు విద్యార్థులు.. పలువురికి గాయాలు.. హన్మకొండలో యాక్సిడెంట్.. వీడియో వైరల్
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Hanamkonda, June 28: అతివేగం నిండు ప్రాణాలను బలికొంటున్నది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. హన్మకొండలో (Hanamkonda) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు హైవే మీద ప్రయాణిస్తూ యూటర్న్ తీసుకుంటుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు స్కూల్ బస్సును ఢీకొట్టింది. కారు వేగంతో నియంత్రణ కోల్పోయిన బస్సు ఒక్కసారిగా బొక్కబోర్లా పడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. విద్యార్థుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ వాహనాలను ఆపి సహాయక చర్యలు చేపట్టారు.
బస్సులో ముగ్గురికి గాయాలు
ఈ ప్రమాద ఘటనలో బస్సులోని ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.