OTT From Central Government: కేంద్రం నుంచి సొంత ఓటీటీ ప్లాట్‌ ఫాం.. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాల ప్రసారమే లక్ష్యంగా ప్రారంభం.. తొలి రెండేండ్లు ఫ్రీ

అయితే, అందులో ప్రసారమవుతున్న కంటెంట్‌ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది.

OTT (Credits: Pixabay)

Newdelhi, May 14: దేశవ్యాప్తంగా ఇప్పటికే వందలాది ఓటీటీలు (OTT) అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో ప్రసారమవుతున్న కంటెంట్‌ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది. ఓ క్లీన్‌ ఓటీటీ ప్లాట్‌ ఫాంను తీసుకొస్తున్నట్టు వివరించింది. ప్రసారభారతి (PrasaraBharathi) ఆధ్వర్యంలో పనిచేసే ఈ ప్లాట్‌ ఫాం లోని కంటెంట్‌ ప్రధానంగా భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. ఇందులో ప్రసారం చేసే కంటెంట్‌ ను కుటుంబం మొత్తం కలిసి వీక్షించేలా తీర్చిదిద్దనున్నారు. వినోదంతో పాటు కరెంట్‌ అఫైర్స్‌ ను కూడా ఇందులో కవర్‌ చేయనున్నట్టు సమాచారం.

ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు

ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

తొలిదఫాలో ఫ్రీ

కేంద్రం తీసుకురానున్న ఈ ఓటీటీ ద్వారా తొలి రెండు సంవత్సరాలు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత ధరలు నిర్ణయించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.