UP Horror: వికలాంగురాలైన మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు.. యూపీలో ఘటన.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే??
ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు.
Newdelhi, Oct 2: వికలాంగురాలైన ఓ మహిళపట్ల ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు (Police) అమానవీయంగా వ్యవహరించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు. హర్దోయ్ జిల్లాలో సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం (SP Office) పరిసరాల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఎస్పీ కేశవ్‌చంద్ గోస్వామి మహిళా కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే??
వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తతో ఉన్న వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. అయితే, పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో బాధితురాలు గోడపై నుంచి దాటి కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన ఇద్దరు మహిళా పోలీసులు ఆమెను రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చారు. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ఆమె ఫిర్యాదు చేయకుండానే గోడ దూకి ఎస్పీ ఆఫీస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేసిందని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.
Earthquake in Haryana: హర్యానాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రత