Crorepati Sweeper In UP: చేసేది స్వీపర్ పని.. అయితే, అతనికి 9 లగ్జరీ కార్లు.. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఉత్తర ప్రదేశ్ పారిశుధ్య కార్మికుడి గురించి తెలుసా?
ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఇతను డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. భార్యా పిల్లలు ఉన్నారు.
Newdelhi, Aug 19: అతని పేరు సంతోష్ జైస్వాల్. ఉత్తర ప్రదేశ్ (Uttarpradesh) లోని గోండా జిల్లాకు చెందిన ఇతను డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్ గా (Sweeper) పనిచేస్తున్నాడు. భార్యా పిల్లలు ఉన్నారు. అయ్యో పాపం.. వచ్చే జీతంతో ఏదో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడేమోలే.. అనుకుంటున్నారా? అలా జరిగితే, ఇది వార్త ఎందుకు అవుతుంది. ఏదో కేసు విషయమై ఇతని గురించి ఆరా తీస్తే, సంతోష్ ఆస్తులు పరిశీలించిన అధికారులు నోరెళ్లబెట్టారు. అతడి వద్ద 9 లగ్జరీ కార్లు, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్నట్లు తేలింది. ఈ వాహనాలు సంతోష్ సోదరుడు, భార్య పేరు మీద ఉన్నట్లు అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్ పోర్ట్ అధికారి నివేదిక ఇచ్చారు. సంతోష్ బ్యాంకు ఖాతా వివరాలు కూడా పరిశీలిస్తున్న అధికారులు అతడిపై కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
ఎలా సంపాదించాడు?
సంతోష్ తొలుత గోండా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్ గా పదోన్నతి పొందాడు. ఈ క్రమంలో ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేసి రూ.కోట్లలో ఆస్తులను సంపాదించాడు. ఫైళ్ల విషయం బయటపడి కమిషనర్ విచారణకు ఆదేశించారు. అలా సంతోష్ గుట్టు రట్టవడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి, పోలీస్ కేసు పెట్టారు.