Viral Video in Hazaribagh: అది దెయ్యమా లేక ఏలియనా, హజారిబాఘ్ సమీపంలో బ్రిడ్జ్ మీద వింత ఆకారం, మతిస్థిమితం లేని వ్యక్తి నగ్నంగా తిరిగి ఉంటాడని చెబుతున్న పెలావాల్ స్టేషన్ ఇన్‌ఛార్జి వికర్ణ కుమార్
మే 28న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని ( Alien-Like Creature Walking on Road at Night) గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని ఆ వీడియోని బట్టి తెలుస్తోంది.
జార్ఖండ్ రాష్ట్రంలో హజారిబాఘ్ సమీపంలోని ఓ బ్రిడ్జ్ మీద వింత ఆకారం తిరుగుతుందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video in Hazaribagh) అవుతోంది. మే 28న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని ( Alien-Like Creature Walking on Road at Night) గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని ఆ వీడియోని బట్టి తెలుస్తోంది. అక్కడి లోకల్ మీడియా కూడా ఈ కథనాలను ప్రచురించింది. ఈ వైరల్ వీడియోని నటి ఏక్తా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో (Ekta Kapoor Shares Spooky Video) షేర్ చేశారు. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని హజారిబాగ్‌లోని పెలావాల్ స్టేషన్ ఇన్‌ఛార్జి వికర్ణ కుమార్ తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా వీడియో మా దృష్టికి వచ్చింది. ఛాద్వా డ్యామ్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ బ్రిడ్జ్ దగ్గర్లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుగుతుంటాడు. బహుశా ఆ వ్యక్తే నగ్నంగా తిరిగి ఉంటాడని అనుమానిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. దీంతో పాటుగా ఫ్రాంక్ వీడియోలు తీసే ఆకతాయిల మీదా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామమని వెల్లడించారు. కాగా, గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురు కాలేదని స్థానికులు అంటున్నారు.
అయితే ఆ బ్రిడ్జ్‌కి వంద మీటర్ల దూరంలో ఓ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగే విషయాన్ని మాత్రం స్థానికులు నిర్ధారించారు. బహుశా అతని వీడియోను మార్ఫింగ్ చేసి ఎవరైనా ఈ ప్రచారానికి తెరలేపి ఉండొచ్చని కొందరు యువకులు అనుమానిస్తున్నారు. ఈ వీడియోపై త్వరలోనే పూర్తి నిజాలు తేలుస్తాం వికర్ణ తెలిపారు.
Here's Ekta Kapoor Shares Spooky Video
కాగా రాత్రి పూట బ్రిడ్జ్‌పై వెళ్తున్న కొందరు ఆ ఆకారం దగ్గరకు వెళ్లగానే ‘‘దెయ్యం దెయ్యం’’ అంటూ అరుస్తూ వీడియో షూట్ చేశారు. ఇక జార్ఖండ్ వైరల్ వీడియోపై సోషల్ మీడియా సరదా కామెంట్లతో నిండిపోయింది. ఇది ఫ్రాంక్స్టర్ల పని కావొచ్చని, క్యాస్టూమ్.. లైటింగ్ ఎఫెక్ట్ మాయాజాలం అయ్యి కూడా ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఏలియన్లు వ్యాక్సినేషన్ కోసం వచ్చి ఉంటాయని, అయినా ఏలియన్లు అమెరికాలో తప్ప ఈ భూమ్మీద ఇంకెక్కడ కనిపించవని జోకులు వేస్తే.. ఇంకొందరేమో ఈ వీడియో సంగతేంటో చూడండంటూ నాసాకి, ఎలన్ మస్క్‌కి ట్యాగులు చేస్తున్నారు.