పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తి కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గంగ, యమున నదుల్లో వందల సంఖ్యలో శవాలు తేలుతూ కనిపిస్తున్న తరుణంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వర్షం పడుతుండగా పట్టపగలు, బ్రిడ్డిపై వాహనాలు తిరుగుతున్న సమయంలోనే ఆ వ్యక్తి మరొకరి సాయంతో ఇలా మృతదేహాన్ని నదిలోకి పడేయడం షాక్ లాంటిదే. ఈ నెల 28న జరిగిన ఈ ఘటనను ఆ సమయంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. అది కొవిడ్ పేషెంట్ మృతదేహమేనని బల్‌రామ్‌పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీబీ సింగ్ చెప్పారు. ఇప్పటికే బంధువులపై కేసు నమోదు చేశారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
#India | A man in a PPE suit was caught on camera throwing a body into Rapti river in #UttarPradesh.
The body was of a Covid positive patient who lost his life on May 28. pic.twitter.com/P49GzBZv5j
— Munir A Hussein (@Munir566) May 30, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)