Case Against BS Yediyurappa: నా కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.. బాలిక తల్లి ఫిర్యాదుతో కర్ణాటక మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు

ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

BS Yediyurappa (Credits: X)

Hyderabad, Mar 15: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎస్‌ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏండ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయనపై ఈ ఆరోపణలు రావడం సర్వత్రా చర్చ జరుగుతున్నది. 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

President, PM in Telangana: నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024'లో పాల్గొననున్న రాష్ట్రపతి.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

ఆరోపణలు ఏమిటంటే??

ఫిబ్రవరి 2న ఓ చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప దగ్గరకు వెళ్లామని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో తన కూతురుపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆమె తెలిపారు. అయితే ఈ విషయమై యడియూరప్ప ఇప్పటివరకు స్పందించలేదు.

Half Day Schools: నేటి నుంచే ఒంటిపూట బడులు.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు.. 12.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం