PM Narendra Modi in Adilabad (photo-ANI)

Hyderabad, Mar 15: నేడు తెలంగాణకు (Telangana) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu), ప్రధాని మోదీ (Prime Minister Modi) రానున్నారు. నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహించే 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024' కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. కన్హ శాంతివనంలో కార్యక్రమం పూర్తయ్యాక ఆమె నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఇక రేపు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ ఖడ్‌ రాష్ట్రానికి రానున్నారు. ఇంకోవైపు ఇవాళ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉంది. ఒకేరోజు రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కార్యక్రమాలు నగరంలో జరగనున్న నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పోలీసులు విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Half Day Schools: నేటి నుంచే ఒంటిపూట బడులు.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు.. 12.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం

మల్కాజిగిరిలో నేడు మోదీ రోడ్ షో..

ఇవాళ మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఐదు కిలో మీటర్ల మేర ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ సాయంత్రం నాలుగు గంటల 55 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి లో రోడ్ షో లో పాల్గొంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు నాగర్‌కర్నూల్‌ లో పర్యటిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక బయల్దేరి వెళ్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

Petrol Diesel Price Down: వాహనదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర రూ.2 తగ్గింపు