Hyderabad, Mar 15: తెలంగాణలో (Telangana) ఎండల తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు (Half Day Schools) ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ (Government), ప్రైవేట్ స్కూల్ (Private School) యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని వెల్లడించారు.
నేటి నుంచి ఒంటిపూట బడులు pic.twitter.com/f7OSc1m2o6
— News Line Telugu (@NewsLineTelugu) March 15, 2024
స్కూల్ అవ్వగానే మధ్యాహ్న భోజనం
ప్రతి పని దినం నాడు 12.30 గంటలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.