Gauhati High Court-Jeans: జీన్స్ ధరించి కోర్టుకొచ్చిన సీనియర్ న్యాయవాది.. బయటకు పంపిన న్యాయమూర్తి

న్యాయమూర్తి ఆయనను బయటకు పంపడమే కాకుండా కేసు విచారణను కూడా వాయిదా వేశారు. అస్సాంలోని గౌహతి హైకోర్టులో జరిగిందీ ఘటన.

Credits: Twitter

Guwahati, Jan 29: జీన్స్ (Jeans) దుస్తులు ధరించి కోర్టుకు (Court) వచ్చిన సీనియర్ న్యాయవాదికి (Senior Advocate) చేదు అనుభవం ఎదురైంది. న్యాయమూర్తి ఆయనను బయటకు పంపడమే కాకుండా కేసు విచారణను కూడా వాయిదా వేశారు. అస్సాంలోని (Assam) గౌహతి హైకోర్టులో జరిగిందీ ఘటన. ఓ కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ కోసం సీనియర్ న్యాయవాది బీకే మహాజన్ కోర్టుకు హాజరయ్యారు.

కొవిడ్ లాక్ డౌన్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రల వినియోగం పైపైకి..

తన క్లయింట్ తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధమైన ఆయనను గమనించిన జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా ఆధ్వర్యంలోని ధర్మాసనం వెంటనే విచారణను నిలిపివేసింది. న్యాయవాది జీన్స్ ధరించి ఉండడాన్ని గమనించిన ధర్మాసనం.. పోలీసులను పిలిచి న్యాయవాది మహాజన్‌ను బయటకు పంపాలని ఆదేశించింది. అంతేకాకుండా ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను వారం రోజులపాటు వాయిదా వేస్తూ జస్టిస్ సురానా ఉత్తర్వులు జారీ చేశారు.

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు



సంబంధిత వార్తలు