Gujarat Viral: కచేరీలో నోట్ల వర్షం.. కళాకారులపై రూ. 50 లక్షలు వెదజల్లిన అభిమానులు!

కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్‌ నవ్‌సారి జిల్లాలోని సుపా గ్రామం దీనికి వేదికైంది.

Credits: ANI

Gandhinagar, Dec 30: అభిమానుల (Fans) ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల (Currency Notes) వర్షం కురిపించారు. గుజరాత్‌ నవ్‌సారి జిల్లాలోని సుపా గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ (Swami Vivekananda Eye Mandir Trust) ఆధ్వర్యంలో బుధవారం భజన్ కార్యక్రమం నిర్వహించారు. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఈ సంగీత కచేరి నిర్వహించారు.

ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూత.. వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని ప్రధాని ట్వీట్.. వీడియోతో

ఈ కార్యక్రమానికి హాజరైన వారు సంగీత కళాకారులపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై డబ్బులు వెదజల్లారు. ఇలా మొత్తంగా దాదాపు రూ. 50 లక్షలు సమకూరినట్టు ట్రస్ట్ పేర్కొంది. కాగా, సంగీత కచేరిలో అభిమానులు డబ్బులు వెదజల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత.. ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ ఆటగాడిగా గుర్తింపు.. వీడియోతో



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif