Donkey Milk: లీటర్ గాడిద పాలు రూ. 5 వేలు- రూ. 7 వేలు.. నెలకు 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తున్న గుజరాత్ యువకుడు..
గాడిద పాలను విక్రయించి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్ కు చెందిన ధీరేణ్ సోలంకీ.
Newdelhi, Apr 22: గాడిద పాలను (Donkey Milk) విక్రయించి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్ (Gujarat) కు చెందిన ధీరేణ్ సోలంకీ. సర్కారు కొలువు (Government Job) కోసం ప్రయత్నించి విఫలమైన ధీరేణ్.. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినా పెద్దగా లాభం లేకపోయింది. దీంతో ఏదైనా బిజినెస్ పెడదామని నిర్ణయించుకున్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో గాడిదల పెంపకానికి ఆదరణ పెరుగుతున్నదని తెలుసుకున్నాడు. సమాచారం సేకరించి.. ఆర్నెళ్ల కిందట కొన్ని గాడిదలను కొని సొంత ఊరిలోనే ఫామ్ ప్రారంభించాడు. ఆన్ లైన్ లో పాలను విక్రయించడం మొదలుపెట్టాడు. డిమాండ్ పెరిగి ఇప్పుడు ఒక లీటరుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధర వస్తున్నట్టు వెల్లడించాడు.
ఆ లాభాలు ఉండటం వల్లే..
గాడిద పాలకు అంత రేటు ఉండటానికి కారణంలేకపోలేదు. ఈ పాలు తాగితే కోరింత దగ్గు, ఆస్తమా, వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని నమ్ముతారు. ఈ పాలను ఫెయిర్ నెస్ క్రీములు, షాంపూలు, లిప్ బామ్, బాడీ వాష్ ల తయారీలోనూ వాడతారని నిపుణులు చెప్తున్నారు.