Hyderabad Shocker: ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి.. మలక్‌పేట్‌లో వెలుగు చూసిన ఘటన.. వీడియో వైరల్

హైదరాబాద్ లోని మలక్‌పేటలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

Representational Picture (File Photo)

Hyderabad, June 24: ఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన హైకోర్టు (High Court) అడ్వొకేట్ ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. హైదరాబాద్ (Hyderabad) లోని మలక్‌పేటలో (Malakpet) తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మూసారాంబాగ్‌లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్‌ మెంట్‌లో ఆంటోని రెడ్డి అలియాస్ క్రాంతి రెడ్డి నివాసముంటున్నాడు. తాజాగా అతడు తన ఇంటి ముందు చెత్తవేశారంటూ ఓ మహిళ, యువకుడిపై దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న మహిళను చేతులుపట్టి బయటకు లాక్కొచ్చాడు. అతడిని అడ్డుకున్న వారిపై కూడా దాడికి దిగాడు. వారిపై పిడిగుద్దులు కురిపించాడు.

Mary Milliben Touches PM Modi's Feet: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్.. వీడియో ఇదిగో

పోలీసులకు ఫిర్యాదు

ఈ క్రమంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడ్వొకేట్ దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తమ ముఖాలపై పిడిగుద్దులు కురిపించాడని బాధితులు ఈ సందర్భంగా వాపోయారు. కడుపులో తన్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Janasena Party Symbol: జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు.. గాజు గ్లాసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి పవన్ సేన.. ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు