MP Gorantla Madhav: నాది చూడాలనుకుంటే మీ ఇంటికి వచ్చి చూపిస్తా, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల మాధవ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు

అయితే తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు పై అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చని ఎస్పీ తెలిపారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై రాజకీయంగా దుమారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు పై అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చని ఎస్పీ తెలిపారు. వైరల్ గా మారిన ఈ వీడియో ఒరిజినల్ కాదని ప్రకటించారు. ఈ రిపోర్టు విడుదలైన కాసేపటికే ఎంపీ గోరంట్ల మాధవ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో మార్ఫింగ్ అని ఆనాడే చెప్పానన్నారు.

కొంతమంది దుర్మార్గులు చేసిన పని ఇదని… రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే ఈ కుట్ర చేశారని నిప్పులు చెరిగారు.ఎబీఎన్‌, చంద్రబాబు, అయన్న పాత్రుడి కొడుకు, నారా లోకేష్‌ లు కలిసి కుట్ర చేశారని.. ఆగ్రహించారు. టీడీపీ పార్టీకి ఏపీలో స్థానం లేదని ఫైర్‌ అయ్యారు. అంతలా చూడాలని అనిపిస్తే.. మీ ఇంటికి వచ్చి.. నా ఒరిజినల్ చూపిస్తానని ఎల్లో మీడియా, టిడిపికి ఎంపీ గోరంట్ల వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



సంబంధిత వార్తలు