MP Woman Shamed: మహిళపై దారుణం, మూడు కిలోమీటర్లు వ్యక్తిని మోసుకుంటూ వెళ్లాలని హుకుం జారీ చేసిన గ్రామస్తులు, మధ్యప్రదేశ్‌లో ఆటవిక చర్య, కేసు నమోదు చేసిన పోలీసులు
మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసేలా ఘటన కళ్లకు కడుతోంది. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న మహిళ పట్ల స్థానికులు, అత్తింటివారి ఆటవిక చర్యలకు (Madhya Pradesh Woman Shamed) పాల్పడ్డారు.
Bhopal, Feb 16: మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసేలా ఘటన కళ్లకు కడుతోంది. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న మహిళ పట్ల స్థానికులు, అత్తింటివారి ఆటవిక చర్యలకు (Madhya Pradesh Woman Shamed) పాల్పడ్డారు. దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఎంపీలొ భోపాల్‌లోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సదరు గ్రామస్తులు, అత్తింటివారు ఆమె ఇంటికి వచ్చి నానా దుర్భాషవలాడారు. అంతటితో ఆగిపోలేదు. మరింతగా ఆమెను హింసించేందుకు (guna women shamed) రెడీ అయ్యారు. మాజీ భర్త కుటుంబంలోని ఒకరిని భుజాలపై మోసుకుంటూ 3 కిలో మీటర్లు నడవాలని (Forced To Walk With In-Laws On Shoulders) ఆ మహిళకు హుకుం జారీచేశారు.
వారిని ఎదిరించలేని మహిళ అసహాయంగా వారు చెప్పినట్టు అత్తింటివారిలో ఓ వ్యక్తిని భుజాలపై ఎక్కించుకుని నడక సాగించింది. ఆమె ఆ వ్యక్తిని ఎత్తుకుని నరకయాతన పడుతుంటే కొంత మంది ఆకతాయిలు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీస్తూ... మరికొందరు ఆమె బాధతో ఒక్కో అడుగు వేస్తుంటే త్వరగా నడువ్.. అంటూ హేళన చేస్తూ బ్యాట్లు, కర్రలతో బెదిరింపులకు దిగారు. మరికొందరు ఆమెను చేయి కూడా చేసుకున్నారు.
Here's Horrific Video :
ఈ ఆటవిక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన నలుగురిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం జబువా జిల్లాలో ప్రేమించిన వ్యక్తికోసం ఇంటి నుంచి వెళ్ళిపోయిన మహిళకు గ్రామస్తులు ఇలాంటి శిక్షే విధించారు. అప్పటి ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.