ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి తనను కాదని వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి (Woman Allegedly Killed Her Boyfriend) చంపేసింది. అంతటితో ఆగకుండా అతని ప్రైవేట్ భాగాలను బిర్యాని వండేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణ ఘటన (Morocco Shocker) వివరాల్లోకెళితే.. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో అతడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె అనుమానించింది.
ఈ విషయాన్ని ప్రియుడితోనే తేల్చుకుందామని అతనిని అడగ్గా.. అతను అది నిజమని..ఆ యువతని త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఆ మహిళ తట్టుకోలేక హత్య చేసింది. ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు అతడి మృతదేహాన్ని ముక్కలుగా కోసి అతడి ప్రైవేటు భాగాలు(పురుషాంగం, వృషణాలు)తో బిర్యానీ వండింది. మాక్బూస్ అని పిలువబడే సాంప్రదాయ భోజనాన్ని తయారుచేసింది.
ఈ వంటకాన్ని తయారు చేసిన తరువాత, ఆ మహిళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తన ఇంటికి సమీపంలో ఉన్న పాకిస్తాన్ నిర్మాణ కార్మికులకు (His Genitals In A Meal To His Friends) ఇచ్చింది. వారు అది చికెన్ కాకుండా మరో ముక్క అయి ఉంటుందని అనుకుని తినేశారు. దాని గురించి వారు ఆమెను అడగలేదు. ఇక మాక్బూస్ లో ముక్కలు వేయగా మిగిలిన భాగాలను కుక్కలకు వేసింది. అయితే ఈ విషయం కొన్ని రోజులకు బయటపడింది.
ఆ వ్యక్తి ఎంతకి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకి కనిపించకపోవడంతో సదరు మహిళపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ ఇంటిలో సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో పోలీసులు మిక్సీలో దంతాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి మృతుడివే అని తేలడంతో పోలీసుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేసి ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
కాగా మృతుడు ఆమె కంటే 10 సంవత్సరాలు చిన్నవాడని పోలీసులు తెలిపారు. ఇంతకీ మాక్బూస్ అంటే తెలియదు కదా... ఈ వంటకం బహ్రెయిన్‌లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన వంట. బియ్యం మరియు మాంసంతో భారతీయ బిర్యానీ మాదిరిగానే చేస్తారు. దీనిని సాధారణంగా చికెన్ తోనే చేస్తారు. ఈ కథనాన్ని 7news.com అనే వెబ్ సైట్ ప్రచురించింది.