Ind Vs Zim ODI Series: టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కాదు. ఇప్పుడు కోచ్ గా హృషికేష్ కనిత్కకర్.. ఎందుకంటే?
ఎందుకు సెలెక్ట్ చేశారంటే?
New Delhi, August 14: మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో భారత అండర్-19 కోచ్ హృషికేష్ కనిత్కకర్ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించునున్నాడు. గతేడాది కనిత్కకర్ నేతృత్వంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకొనే భారత జట్టుకు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా కనిత్కకర్ ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. కాగా కనిత్కకర్ కు భారత సీనియర్ జట్టుతో ఇదే తొలి ప్రయాణం కావడం గమనార్హం. మరోవైపు హెడ్ కోచ్ కూడా రాహుల్ ద్రవిడ్ కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా దూరం కానున్నాడు. ఇక ఈ ముగ్గురు తిరిగి ఆసియాకప్‌కు భారత జట్టుతో చేరనున్నారు.
జింబాబ్వే పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఆగష్టు 18న మొదలు కానున్న ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.