Aarya walvekar: మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?
రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్ కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని అందుకున్నారు.
Newyork, August 7: మిస్ ఇండియా యూఎస్ఏ, మిసెస్ ఇండియా యూఎస్ఏ, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ పోటీలు ఘనంగా జరిగాయి. భారత సంతతికి చెందిన అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్ (18) (Aarya walvekar) మిస్ ఇండియా (Miss India) యూఎస్ఏ-2022 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె స్వస్థలం వర్జీనియా. ఇదే పోటీలో వర్జీనియాకు చెందిన సౌమ్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కిరీటాన్ని అందుకున్న అనంతరం.. ఆర్య వాల్వేకర్ మాట్లాడుతూ.. వెండితెరపై తనను తాను చూసుకోవాలని, సినిమాలు, టీవీల్లో పనిచేయాలనేది తన చిన్న నాటి కల అని పేర్కొన్నారు. కొత్త ప్రదేశాలను అన్వేషించడం , వంట చేయడం, చర్చా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఇష్టమైన హాబీలు (Hobby) అని ఆమె చెప్పారు.
బిగ్ బాస్ ఫేం మెహబూబ్ ఇంట్లో విషాదం.. తల్లిని కోల్పోవడంతో ఎమోషనల్ పోస్ట్
ఇక, వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్ (Newyork) కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని (Crown) అందుకున్నారు. ముప్పై రాష్ట్రాలకు చెందిన 74 మంది అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొన్నారు.