Inland Taipan: ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ పాము ఇది, ఒక్క కాటుతో 100 మందిని చంపేస్తుంది, ఇన్‌ల్యాండ్ తైపాన్ కాటేసిందంటే 2,50,000 ఎలుకలు బలి
ప్రధానంగా ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌ల్యాండ్ తైపాన్ (Inland Taipan) విషపూరిత పాముల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
పాములలో 600 విషపూరిత జాతులలో, కేవలం 200 మాత్రమే మానవుడిని చంపగలవు లేదా గణనీయంగా హాని చేయగలవని తెలిసిన వాస్తవం. ప్రధానంగా ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌ల్యాండ్ తైపాన్ (Inland Taipan) విషపూరిత పాముల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియన్ మ్యూజియం ప్రకారం, ఇన్‌ల్యాండ్ తైపాన్‌ను ఫియర్స్ స్నేక్ అని పిలుస్తారు. దీనిని తరచుగా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముగా (The World's Most Venomous Snake) పేర్కొంటారు.
ఇది మధ్యస్థం నుండి పెద్ద పాము, దృఢమైన నిర్మాణం, లోతైన దీర్ఘచతురస్రాకార తలతో ఉంటుంది. ఇవి తెల్లవారుజామున చాలా చురుకుగా ఉంటాయి, క్లుప్తంగా లోతుగా ఉన్న మట్టి పగుళ్లు, బొరియలలో లేదా సమీపంలోని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము విషం చాలా ప్రభావవంతమైనది అని యూనివర్సిటీ ఆప్ బ్రిస్టల్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
మాములుగా పాముల విషాన్ని ఎల్డీ50 స్కేల్ రూపంలో కొలుస్తారు. అయితే ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము ఒక్కసారి 110 మిల్లీగ్రాముల విషాన్ని విసర్జిస్తుంది. అంటే ఒక్క బైట్‌లో దాదాపు 100 మందిని చంపేందుకు (Single Bite Can Kill Over 100 People) ఆస్కారం ఉంటుంది. లేదా 2,50,000 ఎలుకలు మరణించే అవకాశం ఉంది.