Washington, JAN 22: అమెరికా ఎఫ్‌బీఐ దశాబ్దాలుగా వెంటాడుతున్న మోస్ట్ వాంటెడ్ సీనియర్ హిజ్బుల్లా కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాది (Hezbollah Leader Sheikh Muhammad Ali Hamadi) ఎట్టకేలకు హతమయ్యాడు. హిజ్బుల్లా అగ్రనేత షేక్ ముహమ్మద్ అలీ హమాదీ తన ఇంటి వెలుపల ఉండగా గుర్తుతెలియని ముష్కరులు రెండు వాహనాల్లో వచ్చి కాల్చి చంపినట్లు సమాచారం. హిజ్బుల్లా నాయకుడు గుర్తు తెలియని ముష్కరుల చేతుల్లో కాల్చి చంపబడ్డాడని జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ కాల్పుల్లో హమాదీ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా హమాది మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దాడికి బాధ్యులుగా ఏ గ్రూప్ లేదా వ్యక్తి ఇంకా ప్రకటించలేదు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. మొహమ్మద్ అలీ హమాదీ (Sheikh Muhammad Ali Hamadi) జూన్ 14, 1985న వెస్ట్ జర్మన్ విమానాన్ని హైజాక్ చేయడంలో అతడి పాత్ర ఉందనే అభియోగాలు మోపారు. అయితే, హమాదీ చాలా ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఒక ఉగ్రదాడిలో ఇతడి పాత్ర ఉందనే అభియోగాలతో ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ (FBI Most Wanted Terrorist) జాబితాలో చేర్చింది.
అయితే, ఈ హత్య రాజకీయ స్వభావం కాదని, నాలుగేళ్ల కుటుంబ కలహాల వల్లే ఈ హత్య జరిగిందని అన్-నహర్ నివేదించింది. షేక్ ముహమ్మద్ అలీ హమాది హిజ్బుల్లా పశ్చిమ అల్-బకా ప్రాంతానికి కమాండర్‌గా పనిచేశాడు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఏళ్ల తరబడి కుటుంబ కలహాల అనుమానంతో లెబనీస్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగించారు.
ముఖ్యంగా అక్టోబర్ 2023లో శత్రుత్వాలు చెలరేగిన తరువాత హమాస్‌కు సంఘీభావంగా ఇజ్రాయెల్ లక్ష్యాలపై వరుస రాకెట్ దాడులతో విరుచుకుపడింది. తద్వారా ఇటీవలి ఇజ్రాయెల్-గాజా వివాదంలో హిజ్బుల్లా ముఖ్యమైన పాత్ర పోషించింది. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా కార్యకలాపాలను పెంచేందుకు ఇజ్రాయెల్‌ను ప్రేరేపించింది. దక్షిణ లెబనాన్‌లో భారీ బాంబు దాడులకు దారితీసింది. కీలకమైన హిజ్బుల్లా నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.
చివరికి నవంబర్ 2024లో మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందానికి దారితీసింది. 2025లో కూడా మిడిల్ ఈస్ట్ వివాదం ఉద్రిక్తంగానే ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒక ఏడాది హింసాకాండ తర్వాత జనవరి 19న కాల్పుల విరమణ ఏర్పడింది. కాల్పుల విరమణ తక్షణ శత్రుత్వాన్ని తగ్గించినప్పటికీ, ఇజ్రాయెల్ గాజాలో సైనిక ఉనికిని కొనసాగించాలని యోచిస్తోంది. వెస్ట్ బ్యాంక్ స్వాధీనంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ, హమాస్, ఫతా మధ్య అంతర్గత పాలస్తీనా చర్చలు అపరిష్కృతంగా ఉండటం అనిశ్చితికి దారితీసింది.