JDS MLA Annadani Dance Video: కరోనా సెంటర్లో డ్యాన్స్‌తో దుమ్మురేపిన కర్ణాటక ఎమ్మెల్యే, కోవిడ్‌ రోగుల్లో ఉల్లాసం నింపేందుకు డ్యాన్స్‌తో అందర్నీ అలరించిన జేడీఎస్ ఎమ్మెల్యే కె.అన్నదాని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో

తాజాగా కోవిడ్‌ రోగుల్లో ఉల్లాసం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని (JDS MLA Annadani Dance Video) కూడా రెడీ అయ్యారు. అక్కడ డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఉల్లాస పరిచారు.

Karnataka JDS MLA Annadani Dances for-covid-19-patients (Photo-Twitter Video Grab)

Bengaluru, May 16: దేశంలో సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కరోనా అనగానే భయంతో వణికిపోతున్నారు. కోవిడ్ సెంటర్లలో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. అయితే కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ఉల్లాసం నింపడానికి డాక్టర్లు, నర్సులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా కోవిడ్‌ రోగుల్లో ఉల్లాసం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని (JDS MLA Annadani Dance Video) కూడా రెడీ అయ్యారు. అక్కడ డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఉల్లాస పరిచారు.

వేదిక మీద సరదాగా చిందులేశారు. ఎమ్మెల్యే డాన్స్ చూసి (MLA Annadani Dances for-covid-19-patients) కరోనా రోగులు ఆనందం వ్యక్తం చేశారు. మండ్య పట్టణంలోని రవాణా సంస్థ శిక్షణ కేంద్రం క్వారంటైన్‌ కేంద్రంలో కోవిడ్‌ రోగుల కోసం సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సమయంలో జేడీఎస్ ఎమ్మెల్యే (JDS MLA Annadani) వేదిక మీద సరదాగా చిందులేశారు. స్వతహాగా జానపద గాయకుడు, కళాకారుడు అయిన అన్నదాని మాట్లాడుతూ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో రోగులు ఉల్లాసంగా ఉండాలని తెలిపారు.

Here's MLA Dance Videos

ప‌లు పాట‌ల‌కు ఎమ్మెల్యే డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ అల‌రించింది.క‌రోనా బాధితులు ఉల్లాసంగా గ‌డ‌పాల‌ని ఆయ‌న సందేశాన్ని ఇచ్చారు. కాగా, క‌ర్ణాట‌క‌లో ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా బెంగ‌ళూరులో ఊహించ‌ని స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి.

లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగింపు, కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, దేశ రాజధానిలో తగ్గుముఖం పడుతున్న కేసులు

కర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కోన‌సాగుతోంది. మే 24 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతంలోని దేవ‌సుగుర్ చెక్‌పోస్ట్ ద‌గ్గ‌ర క‌ర్ణాట‌క పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. వైద్యం,నిత్య‌వ‌స‌ర స‌రుకుల వాహ‌నాల‌ను మాత్ర‌మే క‌ర్ణాట‌క‌లోకి అనుమ‌తిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వాహ‌నాలు భారీగా నిలిచిపోయాయి. క‌ర్ణాటక‌లో రోజువారి క‌రోనా కేసులు 40 వేల‌కు పైగా న‌మోదవుతుండ‌టంతో రెండు వారాల‌పాటు సంపూర్ణ‌లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. లాక్ డౌన్ అమలు చేయ‌కుంటే రాబోయె రోజుల్లో ఒక్క బెంగళూరు న‌గ‌రంలోనే అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రించ‌డంతో స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.