Virtual Marriage in Kerala: మొబైల్‌ను భార్యగా అనుకుని తాళి కట్టేశాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వర్చువల్ వివాహం, అబ్బాయిది కేరళ, అమ్మాయిది ఉత్తరప్రదేశ్..
అయితే ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో కూడా పెళ్లిళ్లు కొత్తగా చేసుకుంటున్నారు.ఆ నేపథ్యంలోనే కేరళకు చెందిన ఓ జంట చేసుకున్న "వర్చువల్ వివాహాం" (Virtual Marriage in Kerala) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వధువుతో మొబైల్ ఫోన్ ద్వారా పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్చపర్చాడు.
Kottayam, April 29: కోవిడ్ -19 (COVID-19) నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ (Lockdown) కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో కూడా పెళ్లిళ్లు కొత్తగా చేసుకుంటున్నారు.ఆ నేపథ్యంలోనే కేరళకు చెందిన ఓ జంట చేసుకున్న "వర్చువల్ వివాహాం" (Virtual Marriage in Kerala) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వధువుతో మొబైల్ ఫోన్ ద్వారా పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్చపర్చాడు. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్, పెటాకులైన పెళ్లి, నివ్వెరపోయిన బంధుగణం, వైరల్ అవుతున్న సంఘటన
వివరాల్లోకెళితే.. కేరళలోని కొట్టాయం జిల్లాలోని చెంగనస్సేరీకి చెందిన శ్రీజిత్ నటేసన్ కు, ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం చేస్తున్న అలప్పుజా సిటీకి చెందిన అంజనాకు గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం జరిగింది. అలప్పుజాలోని ఓ ఆడిటోరియంలో ఈ నెల 26న వారి వివాహం జరగాల్సి ఉంది.
అయితే ఇంతలో కరోనా,ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇరుకుటుంబాలు పెళ్లని వాయిదా వేసేందుకు నిర్ణయించారు. అయితే కంప్యూటర్ ఫీల్డ్ లో పనిచేస్తున్న అంజనా ఇచ్చిన ఓ ఐడియా ప్రకారం అనుకున్న సమయానికే వర్చువల్ మ్యారేజీకి ఈ జంట రెడీ అయింది. దీనికి కుటుంబసభ్యులు కూడా ఒప్పకున్నారు. వరుడు తాళి కట్టే సమయానికి మంటపంలో ప్రియుడు ప్రత్యక్షం, అర్ధాంతరంగా నిలిచిపోయిన లగ్గం, నివ్వెరపోయిన సమస్త బంధుగణం
ఇందులో భాగంగా కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్.. అలప్పుజాలో వధువు అంజనా బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ వధువు తండ్రి ఉండగా, పెళ్లికూతురు, ఆమె తల్లి, సోదరుడు లక్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వధూవరులిద్దరూ పెళ్లి బట్టలు ధరించి ఫోన్‌లో లైవ్‌లోకి వచ్చారు.
వెంటనే తాళిబొట్టు చేతపట్టుకుని వరుడు ఫోన్‌కు వెనకవైపున కట్టాడు. అటు వధువు తల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. ఈ తతంగం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రిసెప్షన్‌తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ జరుపుతామని కొత్త పెళ్లికొడుకు శ్రీజిత్ వెల్లడించాడు.