Candidate On Donkey: గాడిదపై వెళ్లి నామినేషన్ వేసిన అభ్యర్థి.. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ వింత చర్య వెనుక గొప్ప కారణమే ఉంది.. అసలేంటీ సంగతి?? (వీడియోతో)
కానీ,
Newdelhi, Oct 28: సాధారణంగా ఎన్నికల్లో (Elections) పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ (Nomination) వేసేందుకు కార్లలోనో (Car), ట్రాక్టర్‌లలోనో, బైకులపైనో (Bike) అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్తారు. కానీ, మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం బుర్హాన్ పూర్ జిల్లాలోని బుర్హాన్ పూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి ప్రియాంక్ సింగ్ థాకూర్ ఏకంగా గాడిదపై వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రియాంక్ సింగ్ గాడిదపై వెళ్లి నామినేషన్ వేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కారణం ఇదే!
రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ప్రియాంక్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా తాను ఇలా చేశానని చెప్పారు. చాలా ప్రాంతాల్లో అధికారం ఎప్పటికీ ఒకే కుటుంబం చేతిలో ఉంటుందోని, ఆ అధికారంతో ఆ ప్రాంత ప్రజలను ఆ కుటుంబం గాడిదలను చేసి వాడుకుంటోందని ప్రియాంక్ సింగ్ మండిపడ్డారు. అందుకే వంశ పారంపర్య రాజకీయాలపై తన వ్యతిరేకతను చాటి చెప్పేందుకు ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేశానని అన్నారు.