Maha Kumbh 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగరాజ్, జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా

కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతి పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర.సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

Prayagraj is set to host the 2025 Maha Kumbh Mela from January 13 to February 26

హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతి పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర.సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది.పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది.

తిరుమల సమాచారం..జనవరి 10 నుండి వైకుంఠ ద్వారా దర్శనం, వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

జనవరి 2007లో చివరగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభ మేళాలో 17 మిలియన్ లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజే 5 మిలియన్ లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా.2001లో జరిగిన చివరి మహా కుంభ మేళాకు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.

Prayagraj is set to host the 2025 Maha Kumbh Mela from January 13 to February 26

ఈ ఏడాది ఈ ఏడాది ప్రయాగ్‌రాజ్ 2025 మహా కుంభమేళాను జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనుంది. ఈ స్మారక ఆధ్యాత్మిక కార్యక్రమానికి గంగా, యమునా మరియు సరస్వతి నదుల పవిత్ర సంగమం వద్ద లక్షలాది మంది తరలివస్తారని భావిస్తున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది