Maruti Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్
మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది.
2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా..కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది. మొత్తం మీద గత జూన్ చివరి నాటికి మొత్తం 1,99,550 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. ఈవీ6 ఎస్‌యూవీ కార్లలో ఐసీసీయూలో సాంకేతిక లోపం, 1,100 వాహనాలను రీకాల్ చేస్తున్న కియా ఇండియా
కేవలం 12 నెలల కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన గ్రాండ్ విటారా.. ఆ తరువాత కూడా అధిక అమ్మకాలను పొందగలిగింది. దీంతో కేవలం 10 నెలల కాలంలోనే మరో లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. గ్రాండ్ విటారా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది.