దక్షిణ కొరియా ఆటోదిగ్గజం కియా ఇండియా (Kia India) తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఈవీ6 (EV6)’ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 మార్చి మూడో తేదీ నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారు చేసిన 1,100 కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ చార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)లో సమస్య తలెత్తడంతో ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. 12-ఓల్ట్ యాక్సిలరీ బ్యాటరీతో చార్జింగ్ వల్ల ‘ఐసీసీయూ’లో సమస్య తలెత్తుతున్నదని, 12 ఓల్ట్ యాక్సిలరీ బ్యాటరీతో సరిగ్గా చార్జింగ్ చేస్తున్నప్పుడు ఐసీసీయూలో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. కియా ఇండియా నుంచి అధ్భుత ఫీచర్లతో ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు, ధర రూ. 60.95 లక్షలతో ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
ఎలక్ట్రిక్ ఈవీలో లైట్స్, మ్యూజిక్ సిస్టమ్, కారులో స్టార్ట్ అండ్ స్టాప్ పని చేయడానికి బ్యాటరీ చాలా కీలకం అని కియా ఇండియా తెలిపింది. ‘ఈవీ6’ కారులో 12-వోల్టుల యాక్సిలరీ బ్యాటరీ పలు కీలక వ్యవస్థలకు మద్దతుగా ఉంటుంది. ఇది ఫెయిల్ అయితే వింగ్ సమయంలో విద్యుత్ అందకపోగా, సేఫ్టీ రిస్క్ తలెత్తే అవకాశం ఉంది. యాక్సిలరీ బ్యాటరీ సరిగ్గా చార్జింగ్ అయ్యేందుకు ఉచితంగా ఐసీసీయూ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. ఈవీ6 వాహనాల యజమానులు తమ సమీప కియా సర్వీసు కేంద్రాలకు వెళ్లి సంప్రదించాలని కూడా సూచించింది. తమ కస్టమర్ కేర్ కేంద్రం కూడా కార్ల యజమానులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపింది.