Kia EV6 Facelift: కియా ఇండియా నుంచి అధ్భుత ఫీచర్లతో ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు, ధర రూ. 60.95 లక్షలతో ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Kia EV6 (Photo Credits : Kia.com)

దక్షిణ కొరియా ఆటో మొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ’ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ (EV6 facelift)’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 2025 ఈవీ6 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లలో కొన్ని వారాల్లో ఆవిష్కరించనున్నది. ఈవీ6 ఎస్‌యూవీలో డ్రైవింగ్ రేంజ్ పెంచడానికి భారీ బ్యాటరీ ప్యాక్‌తోపాటు పలు ఫీచర్లు జత చేసినట్లు తెలుస్తున్నది.కియా ఇండియా నుంచి వస్తున్న తొలి డెడికేటెడ్ ఈవీ మోడల్ ‘ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ’ మొదటిది. Kia EV6 2023 వరల్డ్ కార్ అవార్డ్స్‌లో గ్లోబల్ పెర్ఫార్మెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా పొందింది.

హెడ్ లైట్, టెయిల్ లైట్,‘స్టార్ మ్యాప్ సిగ్నేచర్ లైటింగ్’తోపాటు హెడ్ లైట్ యూనిట్ చుట్టూ రాప్ అరౌండ్ ఎలిమెంట్‌తోపాటు ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్ ఉంటాయని సమాచారం. కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారులో ఇంతకుముందు హ్యుండాయ్ ఐయానిక్ 5లో వినియోగించిన 84కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వాడతారని తెలుస్తుంది.  ఈ అప్‌గ్రేడ్ ఇప్పటికే ఉన్న 77 kWh యూనిట్‌ను భర్తీ చేయగలదు, ఇది SUV పరిధిని పెంచుతుంది. మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ వచ్చేసింది, ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం, మే 15 నుంచి కొత్త కారు బుకింగ్స్..

సింగిల్ చార్జింగ్‌తో 700కి.మీ పై చిలుకు దూరం ప్రయాణించే కెపాసిటీ గల జీటీ లైన్, జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్లను భారత్ మార్కెట్లో విక్రయిస్తుంది.కియా ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు ధర రూ.60.95 లక్షలతో ప్రారంభమై, టాప్ హై ఎండ్ వర్షన్ కారు ధర రూ.65.95 లక్షలు పలుకుతుంది.Kia EV6 2021లో అన్ని గ్లోబల్ మార్కెట్‌ల కోసం మొదటిసారిగా ఆవిష్కరించబడింది. 2022లో భారతదేశంలో ప్రవేశించింది.