Uttar Pradesh: రూ.3 కోట్లు కట్టాలంటూ రిక్షావాలాకు ఐటీ నోటీసులు, ఒక్కసారిగా షాక్ తిన్న రిక్షా కార్మికుడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

రిక్షా కార్మికునికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు (Mathura Rickshaw Puller Receives Income Tax Notice) జారీ చేసింది. ఒక్కసారిగా షాక్ తిన్న రిక్షా వాలా వెంటనే పోలీసులకు ఫిర్యాదు (Approaches Police) చేశాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటు చేసుకుంది.

Income Tax Department | Representational Image | (Photo Credits: PTI)

Mathura (UP), Oct 26: యూపీలో వింత సంఘటన చోటు చేసుకుంది. రిక్షా కార్మికునికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు (Mathura Rickshaw Puller Receives Income Tax Notice) జారీ చేసింది. ఒక్కసారిగా షాక్ తిన్న రిక్షా వాలా వెంటనే పోలీసులకు ఫిర్యాదు (Approaches Police) చేశాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల ఫిర్యాదులో.. బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పడంతో బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని రోజుల తరువాత ఆ షాపులోని వ్యక్తి తనకు పాన్‌కార్డు కలర్‌ కాపీని ఇచ్చాడని తెలిపాడు. అయితే తనకు అక్టోబర్ 19న ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని, రూ. 3,47,54,896 చెల్లించాలని (Pay Over Rs 3 Crore) నోటీసు ఇచ్చారని చెప్పారు. చేసేది లేక తన కథనంతా ఆ రిక్షా కార్మికుడు ఐటీ అధికారులకు వినిపించాడు.

ఇదేం గొడవ..భర్త పోస్టులకు వేరే మహిళ లైక్, కోపంతో మొగుడు ఫోన్‌ పగలగొట్టిన భార్య, ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టిన భర్త, పోలీసుల వద్దకు చేరిన పంచాయితీ

దీంతో తన పేరుపై ఎవరో వ్యాపారాన్ని నడుపడంతో 2018-19లో వ్యాపారపరమైన టర్నోవర్ రూ.43,44,36,201 అని అధికారులు చెప్పడంతో అతనికి అసలు కథ అర్థమైంది. కాగా తాను నిరక్షరాస్యుడు కావడంతో ఒరిజినల్‌ పాన్‌ కార్డుకు, కలర్‌ కాపీకి తేడా గుర్తించలేకపోయినట్లు తన వెనుక జరిగిన మోసాన్ని అప్పుడే అధికారులకు వివరించాడు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఐటీ అధికారులకు అతనికి.. తన పాన్‌ కార్డుని కొందరు దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా