Bizarre Incident: ఏసీ నుంచి 40 పాము పిల్లలు బయటకు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి, పాము పిల్లలని అడవిలో వదిలేసిన అక్కడి వాసులు
ఓ రైతు ఇంట్లో ఉన్న ఏసీ పైపు నుంచి 40 పాము పిల్లలు (0 baby snakes in AC vent) బయటపడ్డాయి. మీరట్ జిల్లాలోని ఖంకర్‌ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పావ్లీ ఖుర్ద్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతుకు (Meerut farmer) చెందిన ఏసీలో పాము కాపురం పెట్టింది. ఏకంగా 40 పిల్లలు బయటపడటం అక్కడ స్థానికంగా కలకలం రేపింది.
Meerut, June 4: ఉత్తరప్రదేశ్‌లో (UP) విచిత్ర సంఘటన జరిగింది. ఓ రైతు ఇంట్లో ఉన్న ఏసీ పైపు నుంచి 40 పాము పిల్లలు (0 baby snakes in AC vent) బయటపడ్డాయి. మీరట్ జిల్లాలోని ఖంకర్‌ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పావ్లీ ఖుర్ద్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతుకు (Meerut farmer) చెందిన ఏసీలో పాము కాపురం పెట్టింది. ఏకంగా 40 పిల్లలు బయటపడటం అక్కడ స్థానికంగా కలకలం రేపింది. ఏనుగుతో పాటు కడుపులో బిడ్డను చంపేశారు, బాణసంచా కూర్చిన పైనాపిల్ తిని కేరళలో ఏనుగు మృతి, ఎఫ్‌ఐఆర్ నమోదు
వివరాల్లోకి వెళితే.. శ్రద్ధానంద్ అనే రైతు తన ఇంట్లో ముందు నేలమీద ఒక పాము పిల్లను చూశారు. దాన్ని తీసి అవతల పారేశారు. కొద్దిసేపటి తరువాత, నిద్రించేందుకు తన గదికి వెళ్లేసరికి మంచం మీద మరో మూడింటిని చూశారు. ఈ పాము పిల్లలు వస్తున్నాయో అర్థం కాక అటూ ఇటూ చూశాడు. ఆ గదిలో ఉన్న ఏసీ పైపు నుంచి కొన్ని పాము పిల్లలు బయటకు వెళ్లడాన్ని అతను గమనించాడు. దీంతో ఏసీని ఓపెన్ చేసి మరింత నిశితంగా పరిశీలించినపుడు ఏసీ పైపులో 40 పాము పిల్లలను చూసి షాక్ అయ్యారు. ఈ వార్త వ్యాపించడంతో స్థానిక ప్రజలు శ్రద్ధానంద్ ఇంటి వద్ద జనాలు గుమిగూడారు.
చివరకు స్థానికుల సహాయంతో, రైతు వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చాలా కాలంగా ఏసీ వాడకపోవడం, లేదా సర్వీసింగ్ చేయకపోవడంతో పాములు గుడ్లు పెట్టి ఉండవచ్చని, ఆ గుడ్ల నుంచి పిల్లలు ఇపుడు బయటకు వచ్చాయని స్థానిక పశువైద్యుడు వత్సల్ అభిప్రాయపడ్డారు. చివరిగా అందరూ కలిసి ఆ పిల్లల్ని ఓ బ్యాగులో వేసుకుని అడవిలో వదిలేసి వచ్చారు.