Elder Women Voting: 81 ఏండ్ల బామ్మ 41 సార్లు ఓటేసింది.. యువతకు ఓటు విలువ తెలియజెప్పడానికే!
చామరాజనగర్ జిల్లాలోని చిక్కాటి గ్రామానికి చెందిన ఈమె.. ఇప్పటివరకూ 41సార్లు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
Bengaluru, Apr 12: ఓటు విలువను (Vote Value) భవిష్యత్తు తరాలకు చాటి చెప్తున్నారు కర్ణాటకకు (Karnataka) చెందిన 81 ఏండ్ల వృద్ధురాలు చిన్నమ్మ. చామరాజనగర్ జిల్లాలోని చిక్కాటి గ్రామానికి చెందిన ఈమె.. ఇప్పటివరకూ 41సార్లు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గ్రామ, జిల్లా పంచాయతీ, అసెంబ్లీ, లోక్‌సభ ఇలా జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ఆమె ఓటింగ్‌లో పాల్గొనేవారు.