Brushing Teeth-Cancer Link: ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటున్నారా? లేదా?? అయితే, ఈ వార్త మీకోసమే.. పొద్దున్నే బ్రష్ చేసుకోకపోతే పెద్దపేగు క్యాన్సర్ వస్తుందట.. అసలేంటీ సంగతి??
మార్నింగ్ బ్రషింగ్ చేసుకోకపోతే, నోటి నుంచి దుర్వాసనతో పాటు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తుంటారు.
Newdelhi, Apr 7: ఉదయాన్నే పళ్లు తోమాలంటే (Morning Teeth Brushing) బద్ధకంగా ఉండేవారి కోసమే ఈ వార్త. మార్నింగ్ బ్రషింగ్ చేసుకోకపోతే, నోటి నుంచి దుర్వాసనతో (Bad Smell) పాటు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తుంటారు. అయితే, ఇప్పుడు అమెరికాకు చెందిన పరిశోధకులు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఉదయాన్నే బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 200 మంది పెద్ద పేగు క్యాన్సర్ బాధితులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్టు వెల్లడించారు.
ఎలా కనిపెట్టారంటే?
పెద్ద పేగు క్యాన్సర్ సోకిన బాధితుల పేగుల్లో ఏర్పడ్డ కణతులను పరిశీలించగా వాటిలో సగం కణతుల్లో దంతాల్లో ఉండే సూక్ష్మజీవులు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. నోటిలో ఉండే సూక్ష్మజీవులు కడుపులోని కింది పేగుల వరకు ప్రయాణం చేయగలవని, పేగు లోపలి పొరలో క్యాన్సర్ కు ఇవి కారణమవుతాయని నిర్ధారణకు వచ్చారు. ప్రతిరోజూ సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే ఇవి పెద్ద పేగుకు చేరుకొని క్యాన్సర్ కు కారణమవుతున్నట్టు తెలిపారు.