Viral Video: మహిళా అధికారి నుంచి గొడుగు లాగేసుకున్న పాక్ ప్రధాని.. వానలో తడిసిపోయిన మహిళ.. నెట్టింట పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వీడియో వైరల్.. పాక్ ప్రధాని తీరుపై నెట్టింట విమర్శలు
ఈ క్రమంలో పాక్ ప్రధాని ఆ అధికారికి ఏదో చెప్పి ఆమె చేతుల్లోంచి గొడుగు తీసేసుకుని నడుచుకుంటూ ముందుకెళ్లిపోయారు.
Newdelhi, June 23: పాక్ ప్రధాని (Pakistan PM) చేసిన ఓ నిర్వాకం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఫ్రాన్స్ లో (France) జరుగుతున్న న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ సమావేశంలో పాల్గొనేందుకు పాక్ ప్రధాని షాబాస్ షరీప్ (Sharif) గురువారం ప్యారిస్‌కు (Paris) చేరుకున్నారు. అప్పటికే అక్కడ వర్షం మొదలైంది. దీంతో, కారులోంచి దిగుతున్న ప్రధాని తడవకుండా ఉండేందుకు ఓ మహిళా అధికారి గొడుగు పట్టారు. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఆ అధికారికి ఏదో చెప్పి ఆమె చేతుల్లోంచి గొడుగు తీసేసుకుని నడుచుకుంటూ ముందుకెళ్లిపోయారు. మహిళా అధికారి మాత్రం ఆయన వెనుక వానలో తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది.
పాకిస్థాన్ పరువు మంటకలిపారు
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు పాక్ ప్రధానిపై దుమ్మెత్తిపోస్తున్నారు. మర్యాద పాటించడం నేర్చుకోండంటూ ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాకిస్థాన్ పరువు మంటకలిపావంటూ మరికొందరు మండిపడ్డారు.