Cheetah. Representational Image. (Photo credits: Twitter/ANI)

Tirumala, June 23: తిరుమలలో (Tirumala)  ఘోరం జరిగింది. అలిపిరి (Alipiri) నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో (Leopard Attack) ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అసలేమైంది అంటే.. కర్నూలు జిల్లా (Kurnool District) అదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)ను తీసుకుని నడక దారిలో తిరుమలకు బయలుదేరారు. ఆ తరువాత మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం కోసం ఆగారు. బాలుడేమో ఆ పక్కనే ఆడుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి వచ్చిన ఓ చిరుత బాలుడిని నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది.

Titanic Tourist Submarine Operation: టైటాన్ కథ విషాదాంతం.. సబ్‌మెరైన్‌లోని ఐదుగురు మృతి.. టైటానిక్ శిథిలాల పక్కనే, తప్పిపోయిన జలాంతర్గామి గుర్తింపు

చిరుతను వెంబడించారు

జరిగిన హఠాత్పరిణామానికి షాక్ కి గురైన పేరెంట్స్ వెంటనే తేరుకొన్నారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు  స్థానికులు, భద్రతాసిబ్బంది పెద్దపెట్టున కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. టార్చిలైట్లు, వేస్తూ రాళ్లు రువ్వుతూ, కేకలు వేస్తూ చిరుతను బెదిరించారు. దీంతో, కంగారు పడ్డ చిరుత బాలుడిని పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చెవి వెనుక భాగం, తలపై పలు చోట్ల గాయాలను వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. బాలుడి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు.

Titanic Tourist Submarine Rescue Operation: నీటి అడుగున శబ్దాలను గుర్తించిన కెనడియన్ పి-3 విమానం, టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ వెతుకులాటలో పురోగతి