Newdelhi, June 23: ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ (Lokmanya Tilak Express) రైలులో గురువారం రాత్రి హఠాత్తుగా మంటలు రావడం కలకలం రేపింది. చెన్నై బేసిన్ బ్రిడ్జి (Chennai Basin Bridge) వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్ నుండి మంటలు (Fire) చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు బోగీల నుండి బయటకు పరుగు తీశారు. ఈ రైలు చెన్నై నుండి ముంబై వెళుతుండగా ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Fore breaks out at engine of Lokmanya Tilak Express and spreads fast. Passengers run for safety. No casualties reported. Friction between engine & power lines caused the fire at 6.48 pm as the train reached Basin Bridge station near Chennai. @GMSRailway @AshwiniVaishnaw pic.twitter.com/cwjmZyEadV
— NewsTAP (@newstapTweets) June 22, 2023
షార్ట్ సర్క్యూటే కారణం
చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరిన అరగంట తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఇక్కడి నుండి రైలు గం.6.20కి బయలుదేరింది. గం.6.48 సమయంలో మంటలు వచ్చాయి. పలువురు ప్రయాణీకులు మంటలు వస్తున్న దృశ్యాన్ని తమ ఫోన్ లలో బంధించారు. ఆ తర్వాత గం.7.15 నిమిషాలకు ఈ రైలు వ్యాసపార్ది జీవా స్టేషన్ నుండి తిరిగి బయలుదేరింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తుంది.