Bihar Shocker: భార్యకు కరోనా వచ్చిందని తల నరికి దారుణ హత్య, అనంతరం బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య, మరో చోట కోవిడ్ సోకిన భర్తను బతికించేకునేందుకు నోటి ద్వారా శ్వాస అందించిన భార్య

భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఓ రైల్వే ఉద్యోగి ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Representational Image | (Photo Credits: IANS)

Patna, April 26: బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఓ రైల్వే ఉద్యోగి ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే.. అతుల్‌ లాల్‌ అనే వ్యక్తి (Railway employee) రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి పత్రకార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మున్నాచక్‌ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లాల్‌ భార్యకు కోవిడ్‌ పాజిటివ్‌గా(Coronavirus) నిర్థారణ అయ్యింది. దాంతో ఆగ్రహానికి గురైన లాల్‌ కత్తితో భార్య తల నరికి హత్య చేశాడు.

ఆ తర్వాత లాల్‌ కూడా అపార్ట్‌మెంట్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఢిల్లీలో ఓ వ్యక్తి అనుమానంతో భార్యను నడిరోడ్డులో కత్తితో 25 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు.

కరోనా వ్యాప్తికి ఈసీదే బాధ్యత, సంచలన వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు, క‌రోనా క‌ట్ట‌డికి స‌రైన ప్ర‌ణాళిక లేకుంటే మే 2న విడుద‌ల‌య్యే ఫ‌లితాల‌ను నిలిపివేస్తామ‌ని హెచ్చరిక

ఇక ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా వికాస్‌ సెక్టార్‌ 7కు రవి సింఘాల్‌ అనే వ్యక్తి కోవిడ్‌ బారిన పడి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు బెడ్లు ఖాళీ లేవని వారిని ఏ ఆస్పత్రిలో కూడా చేర్చుకోలేదు. ఈ లోపు బాధితుడి పరిస్థితి విషమించసాగింది. దాంతో రేణు సింఘాల్‌ అతడిని సరోజిని నాయుడు మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఆటోలో ఎక్కి ఆస్పత్రి వెళ్తుండగా అతడి పరిస్థితి చేయి దాటిపోసాగాంది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడసాగాడు.

Here's Tweets

దాంతో ప్రమాదం అని తెలిసి కూడా భార్య తన నోటి ద్వారా భర్తకు శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నం వృథా అయ్యింది. చివరకు ఆ వ్యక్తి భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు ప్రమాదం అని తెలిసి కూడా భర్త ప్రాణాల కోసం రేణు సింఘాల్‌ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆమె భర్త బతికి ఉంటే బాగుండు అని వాపోతున్నారు.

అందరికీ ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌, 18 ఏళ్లు దాటిన వారందరికీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, 1.34 కోట్ల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం అమోదం

ఇక ఆగ్రాలో చాలా ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్‌ నిల్వలు అయిపోవడంతో పలువురు మరణించారు. ఈ పరిస్థితులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రజల కష్టాలు పట్టవా అని విమర్శిస్తున్నారు. ఇక భారతదేశంలో సోమవారం మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2,812 మంది కోవిడ్‌ పేషెంట్లు మృతి చెందారు.