Telugu YouTuber Entering Mecca: పవిత్ర మక్కాలోకి తెలుగు యూట్యూబర్.. దుమ్మెతిపోస్తున్న నెటిజన్లు.. పదేండ్ల జైలుశిక్షకు డిమాండ్..
ఈ చర్యపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
Mecca, August 3: తెలుగు యూట్యూబర్ (Youtuber) రవి ప్రభు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ముస్లిం (Muslim) సోదరులు పరమ పవిత్రంగా ఆరాధించే సౌదీ అరేబియాలోని మక్కా (Mecca) లోకి ప్రవేశించారు. అంతేగాక, అక్కడి నుంచి లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడారు. మక్కా ప్రధాన ద్వారం, దానిపై రాసి ఉన్న ఖురాన్ సూక్తులు ఇలా అన్నీ ఓ ఫోటో తీసి వివరిస్తూ.. మక్కాను ఓ పర్యాటక ప్రదేశంగా అభివర్ణించారు.
రవిప్రభు వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ముస్లింలకు మాత్రమే ప్రవేశం ఉండే మక్కాలోకి రవి ఎలా వెళ్ళాడని ప్రశ్నిస్తున్నారు. పవిత్ర స్థలంలో ఫోటోలు తీయడాన్ని ఆక్షేపిస్తున్నారు. సౌదీ (Saudi) చట్టాల ప్రకారం అతనికి పదేండ్ల జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నెటిజన్ల (Netizens) ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలను రవి ప్రభు తాత్కాలికంగా హైడ్ చేశారు.