Rat Killing Case: ఎలుక తోకకు రాయికట్టి కాలువలో పడేసి చంపిన వ్యక్తి.. 30 పేజీల చార్జిషీట్ నమోదు చేసిన పోలీసులు.. గతేడాది నవంబరులో ఘటన.. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 5 ఏండ్లు జైలు శిక్ష పడే అవకాశం
కుమార్ అనే వ్యక్తి ఎలుక తోకకు రాయి కట్టి దానిని కాలువలో పడేశాడు. గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దానిని కాలువ నుంచి బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే, అది అప్పటికే మరణించింది.
Newdelhi, April 12: ఇదో విచిత్రమైన కేసు. కుమార్ అనే వ్యక్తి ఎలుక (Rat) తోకకు రాయి కట్టి (Stone) దానిని కాలువలో (Canal) పడేశాడు. గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దానిని కాలువ నుంచి బయటకు తీసి కాపాడే (Rescue) ప్రయత్నం చేశాడు. అయితే, అది అప్పటికే మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో గతేడాది జరిగింది. దీంతో వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి నిర్వహించిన ఫోరెన్సిక్ నివేదికలో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా ఊపిరాడక చనిపోయిందని తేలింది.
ఐదు సంవత్సరాల జైలు!
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్‌పై 30 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడికి 5 ఏండ్ల జైలు, జరిమానా పడొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ.. తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు, చేపలు, గొర్రెల మాంసాన్ని అమ్మే వ్యాపారులపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.