IPL-captains-with-the-trophy (Photo-IPL)

Chennai, April 12: క్రికెట్ ప్రేమికులను (Cricket Lovers) ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL) తమిళనాడు అసెంబ్లీలో (Tamilnadu Assembly) రగడను సృష్టించింది. తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) లో ఒక్క తమిళ ఆటగాడు కూడా లేడని పీఎంకే పార్టీ మండిపడింది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పట్టలి మక్కళ్ కట్చి (పీఎంకే) శాసనసభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. తమిళనాడులో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం కనీసం ఒక్క తమిళ క్రికెటర్ ను కూడా ఎంపిక చేయలేదని వెంకటేశ్వరన్ మండిపడ్డారు. తమిళనాడు టీమ్ అని ప్రచారం చేసుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ ప్రజల నుంచి వాణిజ్యపరమైన లాభాలు అందుకుంటుంటోందని ఆరోపించారు.

DC v MI: ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ సంచలన విజయం..రెండు ఓటముల తర్వాత బోణీ కొట్టిన రోహిత్ సేన

అన్నాడీఎంకే డిమాండ్ ఏంటంటే?

ఇకఎమ్మెల్యేలకు ఐపీఎల్ టికెట్లు సమకూర్చాలని అన్నాడీఎంకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు ఉచితంగా పాసులు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వెల్లడించింది.

Vastu Tips: పొరపాటున కూడా మీ పర్సులో ఈ 4 వస్తువులు ఉంచవద్దు