Lucknow, April 12: గో మూత్రంతో (Cow Urine) చాలా ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయని, ఇది పలు రోగాలను నయం చేస్తుందని అనుకుంటున్నారా? అయితే ఈ తాజా వార్త మీకోసమే. గోమూత్రంతో ఆరోగ్యం బాగుంటుందన్న వాదనలో ఎంతమాత్రమూ నిజం లేదని (No Truth), ఇది మానవ వినియోగానికి అస్సలు పనికిరాదని ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) బరేలీకి చెందిన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) పరిశోధన తేల్చింది. గో మూత్రంలో హానికారక బ్యాక్టీరియా ఉన్నట్టు పేర్కొంది. ఆరోగ్యవంతమైన ఆవులు, ఎద్దుల మూత్రంలో 14 రకాల హానికారక బ్యాక్టీరియాను పరిశోధనలో గుర్తించారు. దీనిలోని ఎషిరిచియా కోలి అనే బ్యాక్టీరియా పొట్ట ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని నిర్ధారించారు.
Fresh cow urine contains harmful bacteria and is not safe for human consumption, says a recent study by animal research body. Research found a minimum of 14 harmful bacteria in urine samples, including Escherichia coli.
#CowUrine #Health #Indiahttps://t.co/dCowqJ59Fi
— India Today NE (@IndiaTodayNE) April 11, 2023
పరిశోధన ఇలా..
ఆవులు, గేదెలతోపాటు 73 మూత్ర నమూనాలను విశ్లేషించినట్టు పరిశోధనలో పాల్గొన్న ఐవీఆర్ఐ ఎపిడిమియాలజీ విభాగాధిపతి భోజ్‌రాజ్ సింగ్‌తోపాటు మరో ముగ్గురు పీహెచ్‌డీ విద్యార్థులు తెలిపారు. ఆవులకంటే కూడా గేదెల మూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ చర్య ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. గో మూత్రాన్ని మానవ వినియోగానికి సిఫార్సు చేయలేమని భోజ్‌రాజ్ సింగ్ స్పష్టం చేశారు.