UP Horror: కీచక టీచర్ అకృత్యం.. 15 మంది పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి.. ముగ్గురి అరెస్ట్.. యూపీలో దారుణ ఘటన వెలుగులోకి
షాజహాన్ పూర్ జిల్లాలోని తిల్ హార్ తాలూకాలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ టీచర్ గా పనిచేస్తున్న వ్యక్తి విద్యార్థినులపై గతకొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఇలా 15 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Lucknow, May 15: యూపీలో (UP) ఘోరం చోటు చేసుకున్నది. షాజహాన్ పూర్ (Shahjahanpur) జిల్లాలోని తిల్ హార్ తాలూకాలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ టీచర్ (Computer Teacher) గా పనిచేస్తున్న వ్యక్తి విద్యార్థినులపై గతకొంతకాలంగా లైంగిక దాడి, వేధింపులకు (Sexual Assualt) పాల్పడేవాడు. ఇలా 15 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతనికి స్కూల్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ సాయపడేవారు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురినీ అరెస్టు చేశారు. విద్యార్థినులు మైనర్లు. 7,8 తరగతులకు చెందినవారు. వీరంతా దళిత వర్గానికి చెందినవారు.
బాలిక తండ్రితో చెప్పడంతో
కంప్యూటర్ టీచర్ తమను అభ్యంతరకరంగా ఎక్కడపడితే అక్కడ తాకుతున్నాడంటూ ఓ బాలిక తన తండ్రితో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోదాలు నిర్వహించగా స్కూల్ టాయిలేట్ లో కండోమ్స్ దొరికాయి. ప్రస్తుతం కంప్యూటర్ టీచర్ జైల్లో ఉండగా, మరో ఇద్దరు సస్పెండ్ అయ్యి పోలీసుల కస్టడీలో ఉన్నారు.